తెలుగు సంధులు సంధి వివరణ: మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది. 'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని సంధి అంటారు. ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది. వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను సంధి అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును సంధికార్యము అని అంటారు. సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిల...
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!
Comments
Post a Comment