'న'కారాన్ని ద్రుతం అంటారు. నకారం చివరన ఉండే పదాన్ని ద్రుత ప్రకృతికము అంటారు.
పూచెన్, తినెను, వెళ్ళెను, పోయెన్ .. పదాలను గమనిస్తే ప్రతి పదానికి చివర 'ను'గానీ, 'న్' గానీ ఉంది. అంటే ప్రతి పదం చివర నకారం ఉంది కాబట్టి ఈ పదాలను ద్రుత ప్రకృతికాలు అంటారు.
సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు పరుషాలకు(క,చ,ట,త,ప) బదులుగా సరళాలు (గ,జ,డ,ద,బ) వాడుతుంటాం.
పూచెన్ + కలువలు
పూచెంగలవలు పదంలో కలువలకు బదులుగా గలువలు వాడబడింది. అంటే క అనే పౌరుషం స్థానంలో గ వచ్చింది.
దెసన్ + చూచి
దెసనుజూచి పదంలో చూచికి బదులుగా జూచి అని వాడబడింది. అంటే చూ అనే పరుషం స్థానంలో జూ అనే సరళం వచ్చింది. ఇలా ద్రుతప్రకృతికాలకు పరుషాలు పరమైనపుడు ఏర్పడే సంధిని సరళాదేశ సంధి అని అంటారు.
సూత్రం-1:
ద్రుతప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి.
ఈ సంధి రెండు, మూడు విధాలుగా జరుగుతుంది. పరిశీలిద్దాం..
పూచెను+కలువలు = పూచెనుగలువలు(*)
= పూచెన్గలువలు(**)
= పూచెంగలువలు(***)
* ద్రుతం మార్పు చెందకుండా వచ్చింది
** ద్రుతం సంశ్లేషగా మారింది.
*** ద్రుతం సున్నగా మారింది.
పై ఉదాహరణల ఆధారంగా సంధి జరగిన తీరును సూత్రంగా చెప్ఫుకుంటే..
సూత్రం-2:
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. విభాషగా అంటే ఒక్కొక్కసారి బిందువు, ఒక్కొకసారి సంశ్లేషలు వస్తాయని అర్థం.
ఉదాహరణలు: మొదటి సూత్రం ప్రకారం...
అంటిని బొచ్చెము కాదు = అంటిని + పొచ్చెము కాదు
ఇచ్చినను జాలును = ఇచ్చిన + చాలును
ఐనను జంపన = ఐనను + చంపన
నేను జేయనా = నేను + చేయనా
ప్రాణములను బాసి = ప్రాణములను + పాసి
పోవచ్చును గాని = పోవచ్చును + కాని
నిండును గాని = నిండును + కాని
విషయమును గూర్చి = విషయమును + కూర్చి
పెంపును గల్గినట్టి = పెంపును + కల్గినట్టి
మాత్రమును జేయు = మాత్రమును + చేయు
హితంబును బెంపును = హితంబును + పెంపును
రెండవ సూత్రం ప్రకారం...
ఏముంబొంది = ఏమున్ + పొంది
ఒప్పుంజుమీ = ఒప్పున్ + చుమీ
గతిదలచిన = గతిన్ + తలచిన
చక్కజేయు = చక్కన్ + చేయు
చేయంజాలదు = చేయన్ + చాలదు
తగం జొప్పక = తగన్ + చొప్పక
చక్కబడుట = చక్కన్ + పడుట
ధృతింబూని = ధృతిన్ + పూని
పగంబగ = పగన్ + పగ
*పగగొన్న = పగన్ + కొన్న
పల్కుదలపు = పల్కున్ + తలపు
పోవంబగ = పోవన్ + పగ
శాంతిబొందుట = శాంతిన్ + పొందుట
గమనిక: అరసున్నలు పెట్టాలి.
గసడదవాదేశ సంధి
కింది పదాలను పరిశీలించండి
గొప్పవాడు + కదా =గొప్పవాడు గదా
కొలువు + చేసి = కొలువు చేసి
వాడు + టక్కరి = వాడుడక్కరి
నిజము + తెలిసి = నిజము దెలిసి
పాలు + పోయక = పాలువోయక
పై ఉదాహరణ గమనిస్తే పూర్వపదాల చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పర పదం మొదట్లో కచటతపలు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమా విభక్తి మీద ప్రత్యయాలకు కచటతపలు పరమైతే వాటి స్థానంలో గ, స, డ, ద, వ, లు ఆదేశంగా వస్తున్నాయి. అంటే..
క __ 'గ' గా మారుతుంది.
చ __ 'స' గా మారుతుంది.
ట__ 'డ' గా మారుతుంది.
త __ 'ద' గా మారుతుంది.
ప __ 'బ' గా మారుతుంది.
అంటే క,చ,ట,త,పల స్థానంలో గ,స,డ,ద,వలు ఆదేశంగా వస్తాయి.
సూత్రం1: ప్రథమ మీది పురుషాలకు గ, స, డ, ద, వ లు బహుళంగా వస్తాయి.
*ప్రథమ అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు అని అర్థం.
కూరగాయలు = కూర + కాయ+లు
కాలుసేతులు = కాలు + చేయి +లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు+లు
తల్లిదండ్రులు = తల్లి + తండ్రి +లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె +లు
పై ఉదాహరణ పరిశీలిస్తే అన్ని ద్వంద్వ సమాస పదాలు. ఈ పదాలలో కూడా క,చ,ట,త,పలు కలిగిన పదాలు పరమైనపుడు గసడదవలు ఆదేశంగా వస్తున్నాయి.
సూత్రం-2: ద్వంద్వ సమాసంలో మొదటి పదం మీద ఉన్న క, చ, ట, త, ప లకు గ,స,డ,ద,వ లు క్రమంగా వస్తాయి.
అక్కసెల్లెళ్ళు = అక్క + చెల్లి
అక్కడే = అక్కడే + కగడుపుడుపు
అది గాని = అది + కాని
అచ్చెరువడి = అచ్చెరువు + పడి
అన్నదమ్ములు = అన్న + తమ్ముడు
ఇంతవట్టు = ఇంత + పట్టు
కండ్లదళుకు = కండ్ల + తళుకు
కుప్పలుగూర్చిన = కుప్పలు + కూర్చున
గుణములు బొగడ = గుణములు + పొగడ
నల్ల గలువలు = నల్ల + కలువలు
నిక్కము దప్పదు = నిక్కము + తప్పదు
నీరు ద్రావి = నీరు + త్రావి
నోరు సూపు = నోరు + చూపు
పట్టువడు = పట్టు + పడు
పసిగట్టు = పసి = కట్టు
పాలు దాగి = పాలు + తాగి
బెట్టులు గట్టిన = బెట్టులు + కట్టిన
ప్రాణములు గల్గి = ప్రాణములు + కల్గి
పొడగానరాక = పొడ + కానరాక
పొచ్చెము గాదు = పొచ్చెము + కాదు
భాగ్యములు వోసి = భాగ్యములు + పోసి
మీరుగూడ = మీరు + కూడ
మొల్లముగ దుమ్మెదలు = మొల్లముగ + తుమ్మెదలు
పట్టువడు = పట్టు + పడు
మేలు గాక = మేలు + కాక
వీడు దడిసె = వీడు + తడిసె
వెలి గాగ = వెలి + కాగ
లిబ్బిసేరు = లిబ్బి + చేరు
సంతము గనుల = సంతసము + కనుల
క్షయము వుట్టుట = క్షయము + పుట్టుట
Comments
Post a Comment