Skip to main content

ఏకలవ్యుడు

             దేశదేశాల రాకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. ద్రోణుడి కీర్తి విని హిరణ్యధన్యుడు అనే ఎలుక రాజు కొడుకు ఏకలవ్యుడు ద్రోణుని వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని అడిగాడు. కానీ ద్రోణుడు హీనజాతి వాళ్లకు విలువిద్య నేర్పనని తిరస్కరించాడు. ఏకలవ్యుడు నిరాశతో వెళ్ళిపోయాడు.

కొంతకాలం తర్వాత కౌరవులు పాండవులు వేట నిమిత్తం సమీపంలోని అడవికి వెళ్ళారు. పాండవులకు చెందిన కుక్క ఒకటి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్లి అతన్ని చూసి మొరగసాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి కుక్క నోటిలో కొట్టాడు. తిరిగి వచ్చిన కుక్కను చూసి రాకుమారులు ఆశ్చర్యపోయారు. ఆ బాణాలు ఎవరు వేశారని వెతుకుతూ అడవులోకి వెళ్ళారు. వారికి ద్రోణాచార్యుని మట్టి విగ్రహం ముందు విలువిద్య సాధన చేస్తున్న ఏకలవ్యుడు కనిపించాడు. ఏకలవ్యుడు రాకుమారులతో తన పేరు ఏకలవ్యుడని, ద్రోణాచార్యుడు తన గురువని చెబుతాడు. రాకుమారులు అక్కడి నుంచి తిరిగి వచ్చి గురువు ద్రోణాచార్యుడుకి ఏకలవ్యుని గురించి చెబుతారు.

             అర్జునుడు తనకంటే మేటి అయిన విలుకాడిని చూసి భరించలేక పోతాడు. ద్రోణుడిని ఒంటరిగా కలుసుకొని "నేనే తమ ప్రియశిష్యుడన్నారు.అని విద్యలూ నేర్పించానన్నారు కానీ ఎరుకలవాడు తమకు ప్రియ శిష్యుడు అట కదా.. అతనికి నాకన్నా విలు విద్యలో నైపుణ్యం ఎక్కువట"అని ఈర్ష్యగా అడిగాడు. 

           ద్రోణుడికి ఇదేమీ అర్థం కాలేదు అర్జునుడు వెంటనే కలిగి ఉండే ప్రదేశానికి వెళ్ళాడు ఏకలవ్యుడు ద్రోణుడికి నమస్కరించి "అయ్యా నేను తమ శిష్యుణ్ణి. తమరు హీనజాతి వాళ్లకు విలువిద్య నేర్పని అంటే నేను ఆ కోరికను అణచుకోలేక మీ రూపాన్ని విగ్రహంగా మలుచుకుని ఆ విగ్రహం ముందు తదేకంగా సాధన చేసి నేర్చుకున్నాను" అని చెప్పాడు.

ఏకలవ్యుడు

అప్పుడు ద్రోణుడు కపట బుద్ధితో గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలు ఇవ్వమని అడిగాడు. ఏకలవ్యుడు సరేనని తన కుడి చేతి బొటన కోసి ఇచ్చాడు. బొటనవేలు తెగిపోవడంతో ఒక మేటి విలుకాడి విలువిద్య అడవిలోనే ఆగిపోయింది.

                    మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                                 

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...