Skip to main content

ద్రౌపది పూర్వ వృత్తాంతం

         పూర్వకాలంలో ఇంద్రసేన అనే ఆమె మౌద్గల్య మహాముని భార్య. ఆమె మహా పతివ్రత. మౌద్గల్యుడు కుష్టురోగం తో బాధపడుతున్నాడు చర్మమంతా వదిలిపోయింది అవయవాలు కూలిపోయాయి కానీ ఇంద్రసేన అసహ్యించు కోకుండా భర్తకు సేవలు చేస్తూ ఉంది‌. ఒకరోజు భర్తకు భోజనం పెట్టింది. మిగిలిన అన్నం తింటూ ఉంది. అందులో భర్త వేలు ఒకటి ఊడి పడి ఉంది. ఇంద్రసేన ఆ వేలుని తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. దీన్ని చూసి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు.

      "ఇంద్రసేన నీ పతిభక్తి అమోఘం. నీకు ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను" అన్నాడు దానికి ఇంద్రసేన "నాకు కామవాంఛలు ఎక్కువగా ఉన్నాయి. అవి మీ వల్ల ఈ రూపంలో తీర లేదు‌ కాబట్టి మీరు అందమైన, మనోహరమైన రూపము ధరించి ఐదుగురిగా మారి ఐదు విధాలుగా నా కామవాంఛలు తీర్చండి"అని కోరింది. దానికి ఆ మహాముని సంతోషించాడు. తన తపో మహిమతో మనోహరమైన రూపము ధరించి ఐదుగురిగా విడిపోయాడు. ఐదు విధాలుగా భార్యతో కామ సుఖాలు అనుభవించాడు. తరువాత బ్రహ్మ లోకానికి వెళ్ళాడు.

       కానీ ఇంద్రసేనకు కామవాంఛలు ఇంకా తీరలేదు. మరుజన్మలో కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగానే మిగిలిపోయింది. శివుని గూర్చి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు. 

          శివుని చూచిన తత్తరపాటుతో తన మనసులో ఉన్న బలమైన కోరికతో "నాకు భర్త కావాలి.. నాకు భర్త కావాలి" అంటూ అప్రయత్నంగా ఐదుసార్లు అడిగింది. అప్పుడు శివుడు ఆమెకు మరుజన్మలో ఐదుగురు భర్తలు ఉంటారని వరమిచ్చాడు. తర్వాత ఆమె తన పొరపాటు గ్రహించి, ఎక్కడన్నా ఒక కన్యకు ఐదుగురు భర్తలు ఉంటారా? అది ధర్మ విరుద్ధం కాదా? కాబట్టి నాకు ఆ వరం వద్దని చెప్పింది. దానికి శివుడు నువ్వు ధర్మం తప్పకుండా ఐదుగురు భర్తలతో ఉంటావని అన్నాడు. 

          ఇంద్రుడు, ఇతర దేవతలు ఇంద్రలోకం వెళుతూ మార్గ మధ్యంలో గంగా నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ కాశీరాజు కూతురు ఏడుస్తూ ఉంది. ఆమెను సమీపించి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు దేవేంద్రుడు. అప్పుడామె వాళ్లను శివుని వద్దకు తీసుకుని వెళ్ళింది. ఆ సమయంలో మహాశివుడు ఒక నవ యువకుడి రూపంలోకి మారి ఒక యువతితో జూదం ఆడుతున్నాడు. అది చూసి దేవేంద్రుడికి కోపం వచ్చింది. ముల్లోకాలకు అధిపతిని, నా ముందు జూదమాడుతున్నావా? అని గర్వంగా అన్నాడు. 

          దానికి శివుడు కోపించి, నీకు చేతనైతే ఆ కొండ గుహను రెండుగా చీల్చమన్నాడు. ఇంద్రుడు తన బాహువులతో ఆ గుహను రెండుగా చీల్చగా అందులో నలుగురు బలవంతులైన వీరులను చూసి ఆశ్చర్యపోయాడు. ఈశ్వరుడు తన నిజరూపంతో సాక్షాత్కరించి ఆ ఐదుగురు ఇంద్రులను మానవలోకంలో జన్మించమన్నాడు. 

           ఆ ఐదుగురు ఇంద్రులే ఈ పాండవులు. ఆ ఆకాశరాజు పుత్రికే ఇప్పుడు నీ కుమార్తె గా ఉన్నా ఈ ద్రౌపది అంటూ వ్యాసుడు తెలిపాడు. 


              మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                                 

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...