Skip to main content

భీష్ముని పూర్వ వృత్తాంతం

                                       అష్ట వసువుల శాపం


            వరుణుడి కుమారుడైన వశిష్ఠుడు మేరు పర్వత గుహలో తపస్సు చేస్తున్నాడు. వశిష్టుని ఆశ్రమంలో నందిని అనే కామధేనువు ఉంది అది వశిష్టునికి కావలసిన అన్నింటిని అందిస్తూ సేవ చేస్తూ ఉంది.

           వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చిన అష్ట వసువులు ఆ కామధేనువు మహిమ చూసి ఆశ్చర్యపోయారు. ఎనిమిదవ వసువు ప్రభాసుని భార్య ఆ కామధేనువును తన ప్రాణ స్నేహితురాలికి కానుకగా ఇవ్వాలని కోరికగా ఉందని అడిగేసరికి ప్రభాసుడు కామధేనువుని వశిష్టునికి తెలియకుండా తీసుకువెళతాడు.

           వశిష్టుడు తన యోగ దృష్టితో చూసి ఈ పని వసువులదని గ్రహించి వారందరిని మానవులై పుట్టమని శపించాడు. అందరూ వశిష్ఠుని కాళ్ళ మీద పడి భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని వేడుకున్నారు. అందుకు వశిష్టుడు అంగీకరించి అలాగే జరుగుతుంది. కానీ అసలు నేరం చేసిన వాడు ఈ ప్రభాసుడు. కాబట్టి వాడు మాత్రం చిరకాలం మానవ లోకంలో సంతాన హీనుడిగా బతుకుతాడని చెబుతాడు. ఈ ప్రభాసుడే భీష్ముడు.

                మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                    

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...