Skip to main content

విదురుని పూర్వ వృత్తాంతం

                                విదురుని జననం

                         మాండవ్యుడు అనే మహర్షి  ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజు గారి ధనాన్ని దోచుకొని, సైనికులు వెంటపడుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి మాండవ్యుని ఆశ్రమంలో దాక్కున్నారు. అటుగా వచ్చిన సైనికులు మాండవ్యునితో 'ఎవరైనా దొంగలు ఇటు వచ్చారా?' అని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు జవాబు ఇవ్వలేదు. సైనికులు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ఉన్న దొంగలను పట్టుకున్నారు మాండవ్య మహామునికి కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగల తోపాటు మాండవ్యుని కూడా బంధించి రాజు గారి సమక్షంలో ప్రవేశపెట్టారు. రాజుగారు ఆ దొంగలకు మరణ శిక్ష విధించారు. దొంగలకు సహాయం చేసినట్లు అనుమానిస్తున్న మాండవ్యునికి ఇనుప శూలం మీద కూర్చోబెట్టాలని శిక్ష విధించారు. కానీ మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక తపస్సు చేసుకుంటున్నాడు ఒక రోజు రాత్రి కొంతమంది మహర్షులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుని చూచి  'మహానుభావుడైన నీకు ఈ శిక్ష వేసిన వారు ఎవరు' అని అడిగారు. అందుకు మాండవ్యుడు నవ్వి తన పూర్వ జన్మ పాపఫలాన్ని అనుభవిస్తున్నానని, దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదని అన్నాడు. ఈ విషయం అక్కడ కాపలా ఉన్న సైనికులు ఈ విషయం రాజుకు చెప్పారు. రాజు వెంటనే అక్కడకు వచ్చి మహర్షిని కిందికి  ఆజ్ఞాపించారు. కానీ శూలం మహర్షి శరీరం నుంచి బయటికి రాలేదు. శూలం బయట భాగాన్ని నరికించారు. శూలంలో కొంత భాగం మాండవ్యుని శరీరంలోనే ఉండి పోయింది. 

    తరువాత మాండవ్యుడు యమ లోకానికి వెళ్ళాడు.  తనకు, రాజు శూలంపై కూర్చుని పెట్టేంత శిక్ష వేయడానికి అంత తప్పు ఏమి చేశానని యమధర్మరాజుని అడిగాడు. అప్పుడు ధర్మరాజు ''చిన్నతనంలో నువ్వు తూనీగలు పట్టుకొని చిన్న చిన్న మేకులకు గుచ్చి ఆనందించావు. ఆ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నావు''  అని అంటాడు. అందుకు మాండవ్యుడు, "పిల్లలు 14 ఏళ్ళు వచ్చేవరకు బాలురని పిలవబడతారు. ఆ వయసులో ఏదీ తెలిసి చేయరు. కాబట్టి ఈ రోజు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలు ఏం చేసినా అది తప్పుకాదు. పెద్దగా పాపం కాదు. కానీ పద్నాలుగేళ్ల పిల్లలకు ఎవరైనా అపకారం చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది" అని నిర్ణయం చేశాడు.( అది ఇప్పటికీ మన కోర్టుల్లో అమలవుతుంది.)

   " కానీ నేను బాల్యంలో చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించారు. కాబట్టి  నువ్వు శూద్ర స్త్రీకి జన్మిస్తావు" అని శాపం పెట్టాడు. ఆ శాపం మూలంగా యమధర్మరాజు వ్యాసుని ద్వారా శూద్ర స్త్రీ అయిన దాసికి విదురునిగా జన్మించాడు.

  

                                   మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                 

                                         

                                   

  

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...