Skip to main content

కర్ణుని జననం

                

                 శూరసేనుడు యాదవరాజు. అతని పెద్ద కూతురు పేరు పృధ.  ఈ శూరసేనుని  మేనత్త కొడుకు కుంతిభోజుడు. అతనికి పిల్లలు లేనందువల్ల తన పెద్ద కుమార్తె అయిన పృధను పెంచుకోవడానికి  దత్తత ఇచ్చాడు. పృధ కుంతి భోజనం ఇంట కుంతి అనే పేరుతో పెరుగుతూ వుంది.

              ఒకరోజు  దూర్వాసుడు  కుంతి భోజుని భవనానికి  వచ్చారు. కుంతి చేసిన సత్కారాలకు సంతృప్తి చెంది ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావం వల్ల ఆమె ఏ దేవత ఆరాధిస్తే ఆ దేవతలు  ఆమెకు కోరిన కొడుకులను ప్రసాదిస్తారు.

              ఒకరోజు కుంతి ఒంటరిగా గంగా నది ఒడ్డుకు వెళ్ళింది. స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం విడిచింది. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది మహర్షి వరాన్ని పరీక్షించాలనుకుంది. సూర్యుని తలుచుకుంటూ  మంత్రాన్ని జపించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు సూర్యుని చూసి వణికి పోయింది. అప్పుడు సూర్యుడు ఆమెతో భయపడవద్దని, ఆమె కోరిన వరం తీర్చడానికే వచ్చానని, తన దర్శనం వృధా కాకూడదని చెప్పి ఆమెను ఆవహించే సరికి, సహజ కవచకుండలాలతో ఒక బాలుడు. జన్మించాడు సూర్యుడు వెళ్ళిపోయాడు. కుంతికి ఏం చేయాలో పాలుపోలేదు.

ఇంతలో నదిలో ఒక పెట్టె తేలుతూ వచ్చింది. వెంటనే ఆమె  ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి  నదిలో వదిలింది. ఆ పెట్టె నదిలో తేలుతూ పోతూ  ఒక సూతుడికి దొరికింది. అతను ఆ బిడ్డను తీసుకువెళ్లి తన భార్యకు అప్పగించాడు.  బిడ్డలు లేని వాళ్ళు ఆ బిడ్డకు వసుషేణుడు అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా  పెంచుకుంటున్నారు. ఈ బిడ్డే కర్ణుడు.

               మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి


                                                

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...