Skip to main content

ద్రోణుడు

             

        భరద్వాజ మహాముని గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ఘృతాచి అనే అప్సరస గంగానదిలో జలకాలాడుతూ ఉంది. ఆమె అందానికి  భరద్వాజునికి కామం కలిగి వీర్యం స్ఖలించింది. భరద్వాజుడు ఆ వీర్యాన్ని సేకరించి ఒక ద్రోణిలో పెట్టాడు. ఆ వీర్యం నుండి జన్మించాడు ద్రోణుడు.

          భరద్వాజుని స్నేహితుడైన పృషతుడు పాంచాల దేశాన్ని పాలిస్తున్నాడు. అతను కూడా అడవులకు వెళ్ళి భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. ఒకరోజు మేనక అనే అప్సరసను చూశాడు. కామంతో వీర్యం పతనమయ్యింది. ఆ వీర్యాన్ని అతడు తన పాదంతో కప్పి వేశాడు. ఆ వీర్యం నుండి ద్రుపదుడు అనే బాలుడు జన్మించాడు. పృషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశం వెళ్ళిపోయాడు.   భరద్వాజుని ఆశ్రమంలో ద్రోణుడు, ద్రుపదుడు కలిసి విద్యాభ్యాసం చేస్తున్నారు.

ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశ్యుని వద్ద ధనుర్విద్యను నేర్చుకుంటున్నాడు. కృపుని చెల్లెలు అయిన కృపిని వివాహం చేసుకున్నాడు. ఆశ్వత్దామ అనే కుమారుడు కలిగాడు.

               ఇదిలా వుండగా పరుశురాముడు బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలిసి ద్రోణుడు పరుసురాముని వద్దకు వెళ్ళాడు. ధనం దానం చేయమని అడిగాడు. అప్పటికే పరుశురాముడు తన వద్దనున్న ధనాన్నంతా దానం చేసేశాడు. అందుకే ‘’ద్రోణా.. నా వద్ద ఉన్న ధనాన్నంతా దానం చేసేశాను ఇక నా వద్ద ఉన్నది శస్త్రాస్త్రాలు మాత్రమే నీకు కావలసి వస్తే  అవి తీసుకో అన్నాడు. ద్రోణుడు సంతోషంగా వాటిని స్వీకరించాడు.

                   ఒక రోజు ద్రోణుడు తన చిన్న నాటి మితుడైన పంచాల దేశాధిపతి ద్రుపదుని వద్దకు వెళ్ళాడు.కాని ద్రుపదుడు ద్రోణునితో స్నేహపూర్వకంగా మాట్లాడకపోగా ‘’పేద బ్రాహ్మణులకి, మహారాజులకి స్నేహం ఎలా కుదురుతుంది? మిత్రత్వమైనా ,శత్రుత్వమైనా సమానమైన వారి మధ్యనే జరగాలి” అంటూ  తక్కువ చేసి మాట్లాడాడు.    ద్రోణుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ఇక అక్కడ ఉండలేక భార్యాబిడ్డలతో హస్తినాపురానికి బయలదేరాడు.

ద్రోణుడు హస్తినకు వస్తున్న మార్గంలో దుర్యోధనాదులు, పాండుకుమారులు ఆట ఆడుతున్న బంతి బావిలో పడిపోయింది. దాన్ని బయటకు ఎలా తీయాలో వాళ్లకు అర్ధం కాలేదు.  అప్పుడు ద్రోణుడు బాణాలను ఒక దానికి ఒకటి కొట్టి తాడుగా చేసి ఆ బంతిని బయటికి తీశాడు. రాజ కుమారులు ఈ విషయాన్ని భీష్మునికి చెప్పారు. అప్పుడు భేష్ముడు వెంటనే ద్రోణుని దగ్గరకు వెళ్ళి అతని వివరాలు అడిగాడు. తన కుమారుడు అశ్వత్దామకు పాలు కూడా కొనలేని దీన స్థితిలో వున్నానని ద్రోణుడు తన గురించి తెలియ చేసాడు.

                   భీష్ముడు ద్రోణునికి కోరినంత ధనాన్ని ఇచ్చి ధృతరాష్ట్రుని కుమారులకు, పాండురాజు కుమారులకు విలువిద్య నేర్పమని కోరాడు. ద్రోణుడు అందుకు అంగీకరించాడు.  

           మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి   

                                

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...