Skip to main content

సుందోపసుందులు

         నికుంభుడు అనే రాక్షసుడికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు. వారిద్దరూ బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అయ్యాడు.  ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి వారు తమకు కోరిన రూపం ధరించేటట్లు, వేరే వాళ్ళ చేతిలోను చావు లేకుండా, ఎప్పటికీ చావు లేకుండా వరం కావాలని అడిగారు. కానీ బ్రహ్మదేవుడు వారికి చావు లేకుండా ఉండే వరం తప్ప మిగిలిన అన్ని వరాలు ప్రసాదించాడు. బ్రహ్మ వర ప్రసాదంతో వారు చెలరేగి పోయారు. భూలోకంలో ఉన్న బ్రాహ్మణులను రాజులను బాధ పెట్ట సాగారు. వారి బాధ భరించలేక మునులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి వారి బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకున్నారు. దానికి బ్రహ్మదేవుడు ఆలోచించాడు. వాళ్ళు వేరే వాళ్ల చేతిలో చావు లేకుండా వరం అడిగాడు కానీ ఒకరి చేతిలో ఒకరు చావకుండా వరం అడగలేదు కదా.. అని ఆలోచించి, విశ్వకర్మను పిలిచి ఒక అందమైన స్త్రీని సృష్టించనున్నాడు. విశ్వకర్మ ఒక లోకోత్తర సౌందర్యవతిని సృష్టించాడు. ఆ సుందరి పేరు తిలోత్తమ. ఆమె బ్రహ్మ ముందు నిలబడి తనను సృష్టించిన కారణం ఏమిటని అడిగింది.  బ్రహ్మదేవుడు ఆమెకు సుందోపసుందులు గురించి చెప్పి వారిలో వారికి కలహం పెట్టి ఒకరిని ఒకరు కొట్టుకొని  మరణించే టట్టు చేయమని చెప్పాడు.

          తిలోత్తమ అలాగే అని భక్తితో బ్రహ్మదేవునికి నమస్కరించి ప్రదక్షిణ చేసింది.  తిలోత్తమ తనకు ప్రదక్షణ చేస్తుంటే, తన తలను నలుదిశలా తిప్పుతూ తిలోత్తమ అందాలని వీక్షించాడు అప్పటినుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. అయ్యాడు.

          తిలోత్తమ అందానికి దేవేంద్రుడు కూడా ముగ్ధుడయ్యాడు. ఆ అందం చూడడానికి రెండు కాళ్ళూ చాలక ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని చూశాడు. అప్పటినుండి దేవేంద్రుడు సహస్రాక్ష అయ్యాడు.

           తిలోత్తమ సుందోపసుందులు వద్దకు వెళ్ళింది. ఆమెను చూసి సుందోపసుందులు కామమోహితులయ్యారు. ఇద్దరూ తిలోత్తమను కామించారు. తిలోత్తమ నాది అంటే నాది అని చెరో చేయి పట్టుకుని లాగుతున్నారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు అని ఆమెను బలవంతం చేశారు. దానికి తిలోత్తమ, నేను మీలో ఎవరిని ప్రేమించాలో తెలుసుకోవాలంటే మీలో మీరు యుద్ధం చేయండి మీలో ఎవరు గెలుస్తారో వారిని నేను ప్రేమిస్తాను అని చెప్పింది. వారిలో  విచక్షణా జ్ఞానం నశించింది. ఒక స్త్రీ కోసం ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నారు. ఇద్దరూ బలవంతులే కాబట్టి ఒకరి చేతిలో ఒకరు చచ్చారు.



              మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                                 

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...