Skip to main content

యాడ బోయాడో ఎక్కడి కేగాడో 

నా ముద్దుల మొగుడేడ బోయాడో

 ఏమై పోయాడో 

ఎద్దులు గొట్టి ముద్దలు దినే 

నిద్దర మొగపు మొద్దు నా మొగుడేడ 

బోయాడో ఆడేడ బోయాడో 

అయ్యో యాడ బొయాడో ఎక్కడి కేగాడో 

నా ముద్దుల ముగుడేడ బోయాడో   ఏమై పోయాడో 


కోడి కూతతో లేసి కూసుంటాడు 

బాన మోకెత్తుక బాయికి పోతాడు 

కాడి మాను కూర్చి కపిల తోలుతాడు 

అలుపన్నదే లేక అండ జెక్కుతాడు 

పచ్చని పైరే ఆడి ప్రాణము 

పుట్టినూరే ఆడి లోకము   "పచ్చని "  


పట్టిడుపు తెలియని పసి మనసున్నోడు 

ఐదునాళ్లయి అయిపులేక పోయ  

అత్త మామ లొచ్చి ఏడి వాడంటె 

నేనేమి సెప్పేదిరో నేనేమని సెప్పేదిరో 

ఏడు కొండా లెంకన్న సామి 

యాదగిరి నరసిమ్మ సామి   "యాడ "


రచ్చబండ కాడ రంపులాకు  బోడు 

సాని కొంపలాకు  సరసమాడ బోడు 

పల్లి పొలిమేర దాటెరగనోడు 

పట్నమెట్టుంటాదొ సూసెరగనోడు 

కడుపు నిండితే కైలాసము 

ఉన్నతావే వైకుంటము 

పట్టిడుపు తెలియని పసి మనసున్నోడు 

ఐదు నాళ్లాయ అయిపు లేక పాయ 

అత్త మామ లొచ్చి ఏడి వాడంటె 

నేనేమొ సెప్పేదిరో నేనేమని సెప్పేదిరో 

ఏడు కొండాలెంకన్న సామి 

యాదగీరీ నరసిమ్మ సామి.  " యాడ"

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...