Skip to main content

అమ్మ ఒడి

 బాడిగ వెంకట నరసింహారావు (15,8,1913-6.1.1994)


కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. 'బాలరసాలు', 'పాలబడి పాటలు', ''ఆవు హరిశ్చంద్ర', 'బాలతనం', 'చిన్నారిలోకం', 'పూలబాలలు' 'ఋతువాణి' వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. 'బాలబంధు'గా ప్రసిద్ధులు, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బాడిగ వెంకట నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన 'అనార్కలి' నాటకంలో అనార్కలి పాత్ర ధరించి, 'అనార్కలి నరసింహారావు'గా ఖ్యాతి గడించారు.


ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బి.వి. నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం లోనిది.


కొత్త పదాలు :


ఒరవడి = మంచిదారి


సుద్దులు = మంచి మాటలు


అనిశము = ఎల్లప్పుడు


ఒప్పిన = ఆమోదించదగిన


బుద్దులు = తెలివితేటలు


హాసము = చిరునవ్వు


నిత్యము = ఎల్లప్పుడు


వికాసము = తెలివి


మంజుల భాషణం = అందమైన మాటలు


శ్రావ్యము = వినదగిన


వీనులు = చెవులు


భూషణం = అలంకారము


మనసు = హృది


అనురాగము = ప్రేమ


దివ్యము = చాలా మంచిది


భవ్యము = ఉత్తమమైనది


యోగము = అదృష్టము


కరములు = చేతులు


ఆకరములు = నిలయాలు


చరణతలము = పాదము క్రింది భాగం



పాఠ్యభాగ సారాంశం :


మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలిగురువు.

నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మఒడి నాకు బడి, గుడి. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితకు ఒరవడి చూపిస్తుంది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకారం. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ చల్లని (మేలైన) చేతులు దానధర్మాలకు నిలయాలు, అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం. 


ఇవి చేయండి


అవగాహన - ప్రతిస్పందన చర్చించండి.


"అమ్మ ప్రేమ ఉత్తమమైనది" దీనిని సమర్థిస్తూ చర్చించండి.


జ. అమ్మ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంది. నవమాసాలు మోసి, ఎంతో కష్టపడి బిడ్డను కంటుంది. బిడ్డను చూడగానే తను పడ్డ కష్టాన్నంతా మరచిపోతుంది. బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుతుంది. బిడ్డ బాగోగులను చూస్తుంది. ఒడిలో కూర్చోబెట్టుకుని ఎన్నో విషయాలు తెలుపుతుంది. మంచి మాటలు నేర్పుతుంది. బిడ్డ సంరక్షణలో తనను తానే మరచిపోతుంది. అందుకే అమ్మ ప్రేమ ఎంతో ఉత్తమమైనది.


3. పాఠం ఆధారంగా కింది వాక్యాలను జతపరచండి.


1. అమ్మ చెప్పే మంచి మాటలు (  )


2 అమ్మ పెదవులపై చిరునవ్వు (  )


3. దాన ధర్మాలకు నిలయాలు (  )


అ) నిరంతరం తెలివినిస్తుంది. 


ఆ) అమ్మ చల్లని చేతులు  


ఇ) ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు


4. కింది కవిత చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయచేతులు



నాన్నంటే ?


సంద్రమంత గాంభీర్యం,


పాలిట కల్పవృక్షం |


(అ) కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు ?


జ. నాన్న


(ఆ) నాన్న గాంభీర్యం ఎలాంటిది?.


జ. నాన్న గాంభీర్యం సముద్రం లాంటిది.


(ఇ) కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు ? 


జ. నాన్న పిల్లలు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. అందుకే నాన్నను కల్పవృక్షంతో పోల్చారు.


(ఈ) ఈ కవితకు తగిన ' శీర్షిక' రాయండి.


జ. 'నాన్న' 


2. వ్యక్తీకరణ సృజనాత్మకత


కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి. 


1. 'అమ్మ ఒడి' గేయం కవి గురించి రాయండి.



జ. 'అమ్మ ఒడి' గేయం కవి బాడిగ వెంకట నరసింహారావు. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. ఈయన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు - హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి మొదలైన పుస్తకాలు పిల్లల కోసం రాశారు. 'బాలబంధు' గా ప్రసిద్ధులు. బాలసాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేశారు. "అనార్కలి నరసింహారావు"గా ఖ్యాతి గడించారు.


2. 'అమ్మ ఒడి - చదువుల బడి' - అని కవి ఎందుకున్నారు ?


జ. అమ్మ బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని ఎన్నో విషయాలు నేర్పుతుంది. ప్రేమను పంచుతూనే మంచి మాటలు చెబుతుంది. బిడ్డ బాగోగులు చూస్తుంది. బిడ్డ భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. అమ్మ బిడ్డకు తొలి గురువు. అందుకే కవి అమ్మ ఒడిని చదువుల బడిగా అభివర్ణించారు.


3. అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి ?


జ. అమ్మ చెప్పే మంచి మాటలు పిల్లలకు ఎల్లప్పుడూ ఉపయోగపడే తెలివి తేటలు, అమ్మ అందమైన మాటలు వినడం పిల్లల చెవులకే అలంకారం. అమ్మ చెప్పిన మాటలు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చక్కని పరిష్కారాలను చూపుతాయి. పిల్లలకు ధైర్యాన్నిస్తాయి, పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి.


ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.


1. అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంతమాటల్లో రాయండి.


జ. అమ్మ బిడ్డకు తొలిగురువు. ఒడిలో కూర్చోబెట్టుకుని ఎన్నో సంగతులు నేర్పుతుంది. ఎల్లప్పుడూ కాపాడుతూ బిడ్డ బాగోగులు చూస్తుంది. అందుకే అమ్మ ప్రత్యక్షదైవం. అమ్మ ఒడి బిడ్డలకు బడి, గుడి. అమ్మ బిడ్డల భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఎన్నో మంచి మాటలు చెబుతుంది. పిల్లల కోసం నిరంతరం పరితపిస్తుంది. అమ్మ మాటలు వినడం పిల్లల చెవులకే అలంకారం. అమ్మ ప్రేమ ఎంతో ఉత్తమమైనది. అన్నిటినీ సమకూర్చుతుంది. అమ్మ చల్లని చేతులు దానధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మే మనకు ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం.


2. 'అమ్మ ఒడి' గేయం ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా! నాన్న / సంరక్షకుని గొప్పతనం రాయండి. 


జ. అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. నాన్న కుటుంబం కోసం పగలనకా, రేయనకా కష్టపడి సంపాదిస్తాడు. కుటుంబంలోని అందరి అవసరాలను తీరుస్తాడు. పిల్లల భవిష్యత్ కోసం కలలు కంటాడు, కష్టపడతాడు. పిల్లలకు చిటికినవేలు అందించి లోకాన్ని చూపిస్తాడు. చేయిపట్టుకు నడిపిస్తాడు. ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. కుటుంబాన్ని సరైన దారిలో నడిపిస్తాడు. కుటుంబానికి రక్షణ కవచంగా ఉంటాడు. పిల్లలు ప్రయోజకులు అయ్యేటంత వరకు నిత్యం తపన పడుతూ ఉంటాడు.


 మీ పాఠశాల గొప్పతనం తెలిసేలా కింది గేయాన్ని పొడిగించండి.


అందమైనది మా బడి 

తెలివి నేర్పే మా గుడి


జ. ఆలనకేమో అమ్మ ఒడి

 పాలనకేమో నాన్న బడి

చక్కనైనది మా బడి

చదువులు చెప్పే గర్భగుడి

ఆటపాటలకు అమ్మ ఒడి

ఆదర్శాలకు చక్కని గుడి:

చక్కనైనది మా బడి

చదువులు చెప్పే గర్భగుడి.


భాషాంశాలు




2. కింది వానిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి.



అ, బ, శ, ఫ, ఠ, భ, ధ, ఖ, థ, ఢ 


1.బ లపం


2. కం ఠం


3. అ రకు


4. ఆ భ రణం


5. పథకం


6. ఇం ధ నం


7. శ తకం


8. స ఫ లం


9.శం ఖం


10. ఢ మరుకం


Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...