Skip to main content

సూర్య చంద్రులకు రాహువుకు వైరం ఎందుకు?

     


       దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సము ద్రాన్ని ఎలా మధించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించ సాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చిం చారు.. బాగా ఎత్తుగా, పొడవుగా ఉన్న మంధర పర్వ తాన్ని కవ్వముగాను, వాసుకిని తాడుగాను నిశ్చ యించారు.

     సర్పరాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు, ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలకు కుంగి పోతూ ఉంది. ఆదికూర్మాను మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిల బడింది. సర్పరాజు వాసుకిని తాడుగా చేసారు. తల వైపు అసురులు, తోక వైపు దేవతలు పట్టుకొని సము ద్రాన్ని చిలకడం ఆరంభించారు.

    మొట్ట మొదట సముద్రంలోనుండి హాలా హలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠం లో నిలుపుకున్నాడు.

    తరువాత, లక్ష్మీ దేవీ, కౌస్తుభ మణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన పక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు, పుట్టాయి. వాటిని మహేం ద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరిం చారు. కాని విష్ణుమూర్తి, మోహినీ రూపంతో రాక్షసులను వంచించి, ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు.

     రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. రాహుపుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విష యాన్ని సూర్యుడు, చంద్రుదు గుర్తించారు. వెంటనే విష్ణువుకు ఈవిషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహువు తల తెగ నరికాడు.

      కానీ అప్పటికే అమృతం రాహువు కంఠం దాకా వెళ్లింది కాబట్టి, తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి వేరై పడిపోయింది. అప్పటి నుండి రాహుపుకు, సూర్య చంద్రులకు బద్ధ వైరం ఏర్పడింది.

      దేవ దావన యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేసారు. వాళ్ల ధాటికి రాక్షసులు తట్టుకోలేక పోయారు. ఓడి పోయారు. సముద్రంలోకి పారి పోయారు. దేవతలు విజయం సాధించారు. మంధర పర్వతాన్ని ఇది వరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు.


Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...