Skip to main content

Song on Parents Love

తల్లిదండ్రుల ప్రేమ 



పల్లవి:

అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమ కన్నా 

అవనిలోన మిన్న ఏముందిరా కన్నా 

అమ్మంటే అనురాగం కురిపించే ఒక మేఘం 

నాన్నంటే మమకారం నీ కంటికి ప్రాకారం 

నైవేద్యం కోరని దేవత ఇలలోన అమ్మంటే 

కోరకున్న వరములు ఇచ్చే కులదైవం నాన్నంటే 

||అమ్మ ప్రేమ||


చరణం:

బుడిబుడి అడుగులతో నడిచి బడలోకి నువ్వు వెళుతుంటే 

తమ ప్రాణాలను నీ వెంటే నీడగా నీతో పంపారు 

అమ్మానాన్నల అరికాళ్ళే అమరేను నీకు మేజోళ్ళు

ఎండావానా తమ పాలే అందేను నీకు మురిపాలు 

అడుగులే జారిన గుండెలోన దిగు గునపాలే

కన్నులే వాలినా  కుమిలి పోవు తమ కనుపాపే

ఇంతకన్న విలువైన ప్రేమ కనిపించేనా ముల్లోకాల్లో 


||అమ్మ ప్రేమ||


చరణం:

సూటూబూటూ నీకేసి దొరబాబులాగ నిను చూసి

చేతి మిషనుతో అతుకేసి చిరుగు బట్టలతో గడిపారు 

ఉన్నత చదువులు చదివించి ఉన్నవాడిగా నిను పెంచి

సన్నని బియ్యం తినిపించి సద్దిబువ్వనూ తిన్నారు 

వంటినే వింటిగా పంపినారు ముందుకు నిన్ను 

వాలితే మధ్యలో విరిగిపోక ఉందా వెన్ను

ఇంతకన్న విలువైన ప్రేమ కనిపించేనా ముల్లోకాల్లో 


||అమ్మ ప్రేమ||




Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...