Skip to main content

గరుత్మంతుడు

      కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత భార్యలు. పుత్ర సంతానం కోసం వారు కశ్యపుని ప్రార్థించారు. కద్రువ తనకు ప్రకాశవంతులైన పొడవైన దేహం గల వెయ్యి మంది కుమారులు కావాలని కోరింది. వినత కద్రువ కుమారులకంటే బలవంతులైన ఇద్దరు కుమారులు కావాలని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు.

     వినత,కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు కలిగాయి. 

      కొంతకాలానికి కద్రువకు కలిగిన అండాలు పగిలి అందులోనుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పాలు బయటకు వచ్చాయి. కానీ వినతకు కలిగిన అండాలు ఎంతకూ పగల లేదు. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని అండాలలో ఒక అండాన్ని బలవంతంగా చిదిమింది. అందులో నుండి నడుము కింద దేహము లేని అనూరుడు పుట్టాడు. అనూరుడు తల్లి వినతను చూసి "ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావం కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు" అని శపించి "అమ్మ అ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు అందులో నుండి పుట్టబోయే వాడు మహా బలవంతుడు. నీ దాసీత్వాన్ని పోగొడతాడు" అని చెప్పి అనూరుడు సూర్యభగవానుడి రథసారథిగా వెళ్లాడు.

      జరిగినదానికి బాధపడ్డ వినత రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు సాగింది.

      ఒకరోజు దేవేంద్రుడి గుర్రం ఉచ్చైశ్రవము అనే తెల్లని గుర్రం సముద్రం ఒడ్డున విహరిస్తూ ఉంది. వినత కద్రువ సముద్రపు ఒడ్డుకు విహారానికి వెళ్లారు.కద్రువ గుర్రాన్ని చూసి "వినతా చూశావా.. ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో! కానీ ఆ గుర్రం తోక మాత్రం నల్లగా ఉందేమి" అంది పరిహారంగా. వినత గుర్రాన్ని బాగా పరిశీలించి చూసింది. తోక కూడా తెల్లగానే ఉంది.

     "అదేమిటక్కా అలా అంటావు. గుర్రం తోక తెల్లగా ఉంటేను" అంది వినత. 

కద్రువకు పట్టుదల పెరిగి "అయితే ఒక పందెం.. ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి. తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను" అంది కద్రువ. వినత దానికి ఒప్పుకొని వెళ్లి చూద్దామని చెప్పింది.

    "ఇప్పుడు పొద్దు పోయింది ఎక్కడికి పోతుందిలే.. రేపు చూద్దాంలే" అంది కద్రువ. సరేనని ఇద్దరూ ఇళ్లకు వెళ్లారు. ఆరోజు రాత్రి కద్రువ తన కొడుకులను పిలిచి, తనకు వినతకు జరిగిన పందెం విషయం చెప్పి "కుమారులారా.. మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం గుర్రం తోక నల్లగా కనపడాలి" అంది. ఈ అధర్మానికి కద్రువ కొడుకులు ఒప్పుకోలేదు. దానికి కద్రువ కోపించి మీరు తల్లి మాటలు వినలేదు కాబట్టి పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవు గాక" అని శాపం ఇచ్చింది.

  ఈ శాపానికి భయపడి కర్కోటకుడు అనే పాము తల్లి కోరిన పని చేస్తానన్నారు వెంటనే కర్కోటకుడు సముద్రపు ఒడ్డుకు వెళ్లి గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. తోక నల్లగా కనబడసాగింది.

     మరునాడు ఉదయం కద్రువ, వినత సముద్రతీరానికి వెళ్లారు. గుర్రం తోకని చూశారు. తోక నల్లగా కనబడింది. వినత ఓడిపోయినట్టు ఒప్పుకొంది. అప్పటినుండి వినత కద్రువకు దాసి అయ్యింది. కొంతకాలం గడిచింది వినత జాగ్రత్తగా కాపాడుతున్న అండం తగిలింది. అందులో నుండి గరుత్మంతుడు పుట్టాడు. బయటకు రాగానే అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వెంటనే కిందికి వచ్చి తల్లికి నమస్కరించాడు. 

    అత్యంత బలవంతుడైన గరుత్మంతుని చూసి కద్రువకు అసూయ కలిగింది. వినత తనకు దాసి కనక దాసి కుమారుడు గరుత్మంతుడు కూడా తనకు దాస్యం చేయాలని చెప్పి ప్రతిరోజు పాములన్నింటిని వీపు మీద ఎక్కించుకుని విహారానికి తీసుకెళ్ళమని ఆజ్ఞాపించింది.

    ఒకరోజు గరుత్మంతుడు పాములను తన వీపు పై ఎక్కించుకుని సూర్య మండలం వరకు ఎగిరాడు. అక్కడ ఉన్న వేడిమికి పాములు తట్టుకోలేక మాడిపోయి మూసుకుపోయాయి. ఇది చూసి కద్రువ దుఃఖించింది. ఇంద్రుడిని ప్రార్థించి వర్షం కురిపించింది. ఆ వానలో తడిసి పాములన్నీ సేద తీరాయి. జరిగినదానికి కద్రువ గరుత్మంతుని దూషించింది. అది సహించలేకపోయాడు గరుడుడు. తల్లి అయిన వినతను చూసి తాము వాళ్లకి ఎందుకు చేస్తున్నామని అడిగాడు. వినతి జరిగిన పందెం గురించి చెప్పి బాధ పడింది. అంతేకాకుండా గరుత్మంతుడి అన్న అనూరుడు గరుత్మంతుని వల్ల తన దాస్యం తొలగిపోతుందని కూడా చెప్పాడని చెప్పింది.

    వెంటనే గరుత్మంతుడు పాముల వద్దకు వెళ్లి మీకు ఏమి చేస్తే నా తల్లి దాస్య విముక్తి అవుతుందని అడిగాడు. అప్పుడు పాములన్నీ దేవలోకంలో ఉన్న అమృతం తెచ్చి మాకిస్తే నువ్వూ, నీ తల్లి దాస్య విముక్తులవుతారని చెప్పారు. 

  గరుత్మంతుడు దేవేంద్ర లోకానికి వెళ్లి అమృతం తెచ్చి కద్రువ కుమారులు ఇచ్చాడు తన తల్లిని దాస్యం నుంచి విముక్త  పరిచాడు.

మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి


  

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

సంస్కృత సంధులు

                                           సంస్కృత సంధులు సంధి వివరణ:                    మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి   మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే...